ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలోని శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాదాద్రిలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు - SHIVARATRI JATAHARA IN YADADRI
మహాశివరాత్రిని పురస్కరించుకుని యాదాద్రిలోని రామలింగేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. అభిషేకాలు, ప్రత్యేక పూజలతో స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
SHIVARATRI CELEBRATIONS IN YADADRI
మహాశివునికి నిత్యహవనం, పంచాక్షరీ జపాలు, నందీశ్వర పారాయణములు, పంచసూక్త పఠనాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. రాత్రంతా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు తెలిపారు.