తెలంగాణ

telangana

ETV Bharat / state

రామలింగేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు - తెలంగాణ వార్తలు

యాదాద్రిలోని రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం నాడు లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సాయంకాలం స్వామి, అమ్మవార్ల రథోత్సవం జరిపారు.

shivaratri celebrations at ramalingeswara swamy temple in yadadri bhuvanagiri district
రామలింగేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు

By

Published : Mar 12, 2021, 7:01 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి కొండపైన అనుబంధ ఆలయం పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం శివబాలాలయంలో నిత్యహవనములు, శివనామ జపములు, నందీశ్వర పారాయణాలు, పంచసూక్త పఠనాలు, మూల మంత్ర జపములు, వివిధ పారాయణాలు నిర్వహించారు.

ఉదయం 11 గంటల నుంచి రెండు గంటల వరకు లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయంకాలం స్వామి, అమ్మవార్ల రథోత్సవం జరిపారు. ఈ నెల 8న ప్రారంభించిన మహాశివరాత్రి ఉత్సవాలు 13వరకు జరగనున్నాయి.

ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారిణి ఎన్.గీత, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రామప్పలో వైభవంగా శివపార్వతుల కల్యాణం

ABOUT THE AUTHOR

...view details