యాదాద్రి భువనగిరిజిల్లా మోటకొండూరులో సోమవారం మూడు గొర్లపాకలు దగ్ధమయ్యాయి. భూమండ్ల వెంకటేష్, బుడిగే సిద్ధయ్య, దడిగే సిద్ధులు అనే గొర్ల కాపరుల పాకల్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.
గొర్రెలను రోజువారి మేతకు తీసుకువెళ్లిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం వల్ల నష్టం తగ్గిందని గొర్రెల కాపరులు అన్నారు. కానీ తాము ఎంతో కష్టనష్టాలకోర్చి కొట్టాలను నిర్మించుకున్నామని ఒక్కొక్క కొట్టం నిర్మించుకోవడానికి సుమారుగా రూ. లక్ష నుంచి రూ.50 వేలు ఖర్చు అయ్యిందని వాపోయారు.