తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురికి తీవ్ర గాయాలు - యాదాద్రి భువనగిరి

రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురికి తీవ్ర గాయాలైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. అడ్డగుడూరు మండలం చిర్రగుడూరులో ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు.. బైక్‌ను ఆటో ఢీకొట్టిన ఘటనలో మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

Seven people were seriously injured in two separate accidents in yadadri bhuvanagiri district
రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురికి తీవ్ర గాయాలు

By

Published : Mar 1, 2021, 11:53 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అడ్డగూడూరు మండలం ఈటూరుకు సమీపంలో.. వేగంగా వచ్చిన ఓ ద్విచక్రవాహనం ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. బైక్‌ పైనున్న శ్రీనివాస్, వంశీలు తీవ్ర గాయాల పాలయ్యారు.

మరొక ఘటనలో..

చిర్రగూడూరు స్టేజీ సమీపంలో ఓ ఆటో అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఆటో డ్రైవర్‌ మహేందర్‌తో పాటు అతని భార్య శిరీషకు స్వల్ప గాయలయ్యాయి. బైక్‌ పైనున్న యాకయ్య, ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను తిరుమలగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:ఆయిల్​ ట్యాంకర్​ను ఢీ కొట్టిన బైక్​.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details