యాదాద్రి ఆలయంలో ప్రసాదాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడిన ఆ విభాగం సీనియర్ అసిస్టెంట్ శివకుమార్‌ను ఆలయ ఈఓ గీతారెడ్డి సస్పెండ్ చేశారు. మరో నలుగురు జూనియర్ అసిస్టెంట్లకు ఛార్జి మెమోలు జారీ చేశారు.
ప్రసాద విక్రయాల్లో గోల్మాల్.. ఒకరు సస్పెండ్ - యాదాద్రి ఆలయంలో ప్రసాద అక్రమాలు
దేవుడి ప్రసాదం అంటే భక్తులకు ఎంతో ప్రీతీ. వాటిని తింటే ముక్తి ప్రాప్తిస్తుందని నమ్మకం. అలాంటి భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. యాదాద్రి ఆలయంలో ప్రసాదాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడ్డ ఒకరిని అధికారులు సస్పెండ్ చెేయగా మరో నలుగురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు.
ప్రసాద విక్రయాల్లో గోల్మాల్.. ఒకరు సస్పెండ్
ప్రసాద విక్రయ కేంద్రంలో ఆకస్మిక తనికీ చేపట్టిన అధికారులు రూ.20 విక్రయించే లడ్డూలు సుమారు 300 లడ్డూలు తక్కువగా ఉన్నట్లు గమనిించారు. స్టాకు వివరాలను పరిశీలించి సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.
ఇదీ చదవండి:'ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకున్నారు.. కొడుతున్నారు'