యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం, శాస్త్రోక్తంగా కొనసాగింది. కొండపై అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న చరమూర్తుల మందిరంలో శ్రీ రామనవమి వేడుకలు నిర్వహించారు. సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, బంగారు ముత్యాల ఆభరణాలతో.. ఆలయ అర్చకులు దివ్య మనోహరంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు.
యాదాద్రిలో నిరాడంబరంగా సీతారాముల పట్టాభిషేకం - seetharamula pattabhishekam in yadadri
యాదాద్రి సన్నిధిలో సీతారామచంద్రస్వామి పట్టాభిషేకం శాస్త్రోక్తంగా సాగింది. కొవిడ్ నేపథ్యంలో భక్తులు లేకుండానే అంతరంగికంగానే వేడుకలు జరిగాయి.
యాదాద్రిలో సీతారాముల పట్టాభిషేకం
ఈ వేడుకలో పరిమిత సంఖ్యలో ఆలయ అర్చక, వేద పండిత బృందంతో పాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి లేకుండా అంతరంగికంగానే వేడుకలు జరిపారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగిన వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త ఛైర్మన్ నరసింహమూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జీహెచ్‌ఎంసీ పరిధిలో 63 మినీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు