రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుపుతున్నారు. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా... స్వామివారిని గోవర్ధనగిరిదారిగా అలంకరించి... బాలాలయంలో ఊరేగించారు. వజ్ర వైఢూర్యాలతో అలంకరించారు. నయన మనోహరంగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు.
యాదాద్రికి భక్తులు... వైభవంగా అధ్యయనోత్సవాలు - యాదాద్రి ఆలయం వార్తలు
నూతన సంవత్సరం సమీపిస్తుండటం, ధనుర్మాస వేడుకలు, అధ్యయనోత్సవాల నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చి హరిహరులను ఆరాధించారు. ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు తీర్చుకున్నారు.
![యాదాద్రికి భక్తులు... వైభవంగా అధ్యయనోత్సవాలు second day of adhyayan utsavalu in yadadri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10020442-thumbnail-3x2-yadadri.jpg)
యాదాద్రికి భక్తులు... వైభవంగా అధ్యయనోత్సవాలు
ఆలయ అర్చకులు... మేళతాళాలు, మంగళ వాద్యాల హోరు నడుమ, వేదపండితుల వేదపారాయణాలు, దివ్య ప్రబంధ పారాయణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోవర్ధనగిరి అవతార విశిష్టతను తెలిపారు.