యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శివారులోని సురేంద్రపురి స్టేజి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన స్కూటీ... ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించగా... మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. క్షతగాత్రులు బండసోమారానికి చెందిన రాజు, గణేష్, మల్లమ్మగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూటీ... ముగ్గురికి గాయాలు - accident
యాదగిరిగుట్ట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురకి తీవ్ర గాయాలయ్యాయి.
![ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూటీ... ముగ్గురికి గాయాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4390197-898-4390197-1568054240063.jpg)
ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూటీ... ముగ్గురికి గాయాలు
ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూటీ... ముగ్గురికి గాయాలు
ఇదీ చూడండి: కేంద్ర రవాణాశాఖ మంత్రికే తప్పని ట్రాఫిక్ చలానా!