యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 47వ జిల్లాస్థాయి జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సైన్స్, మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్‌ను మదర్ థెరిసా పాఠశాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గదారి కిషోర్, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ , జెడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులలో ఉన్న శాస్త్రవేత్తలను వెలికి తీయటానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, విద్యార్థుల నుంచే శాస్త్రవేత్తలు ఉద్భవిస్తారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆలోచన వివిధ పరికరాలను సృష్టించగలిగిందన్నారు.
విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందన్నారు. వారిలో ఉన్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించే విధంగా కృషిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. గొప్ప ఆవిష్కరణలకు ప్రభుత్వం తరపున సాయం అందిస్తామన్నారు. ఈ విద్య వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నలుమూల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొన్నారు.
'విద్యార్థుల నుంచే శాస్త్రవేత్తలు ఉద్భవిస్తారు' - భువనగిరి తాజా వార్త
విద్యార్థులలో ఉన్న శాస్త్రవేత్తలను వెలికి తీయడానికి ఉపాధ్యాయుల పాత్ర ఎంతగానో ఉంటుందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల నుంచే శాస్త్రవేత్తలు ఉద్భవిస్తారని మంత్రి తెలిపారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి జవహర్లాల్ నెహ్రూ జాతీయ సైన్స్ మ్యాథ్స్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
'విద్యార్థుల నుంచే శాస్త్రవేత్తలు ఉద్భవిస్తారు'
ఇదీ చూడండి: సోయి లేకుండానే దారుణాలు..!