తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో కొండ కిందే సత్యనారాయణ పూజలు

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల నిర్వహణలో మరో అన్నవరం క్షేత్రంగా పేరొందిన యాదాద్రిలో ఆ పూజల వేదిక కొండ పైనుంచి కిందికి తరలనుంది. కార్తికమాసం ముగిశాక సదరు పూజలను, కొండ కింద పాత తులసి తోట ప్రాంగణంలో గల సముదాయాల్లో లేదా అనుబంధంగా కొనసాగుతోన్న పాతగుట్టలో నిర్వహించాలని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యోచిస్తోంది.

yadadri
యాదాద్రిలో కొండ కిందే సత్యనారాయణ పూజలు

By

Published : Dec 10, 2020, 10:51 AM IST

తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మహా దివ్వంగా రూపొందించే ప్రణాళికతో యాడా కొండపై హరిహరుల ఆలయాలతో సహా ఇతర కట్టడాలను త్వరితగతిన పూర్తి చేయాలని సంకల్పించింది. ఆ మేరకు ప్రస్తుతం విష్ణు పుష్కరణి చెంత గల రెండంతస్తుల భవన సముదాయాన్ని దైవ దర్శనాలకై వేచి ఉండే భక్తుల కోసం.. వరుసల ఏర్పాట్లతో తీర్చిదిద్దనున్నారు.

ఆ పనులు చకచకా నిర్వహించేందుకు ఆ భవన సముదాయంలో జరుగుతున్న వ్రతాలను మరో చోటికి తరలించాలని యాడా దేవాలయ నిర్వాహకులకు గత అక్టోబర్​లో సూచించింది. అత్యంత పవిత్ర మాసంగా ఆరాధించే భక్తుల సామూహిక వ్రతాలను కొండపై జరపాలని దేవస్థానం నిర్ణయించింది. ఇక వచ్చే ఆదివారం నాటితో కార్తిక మాసం ముగియనుంది. దీనితో వ్రతాల నిర్వహణ మరోచోట కొనసాగనుంది.

కార్తిక మాసం తర్వాత... కొండ కిందనే నిర్వహణ..

కొండపై ప్రధాన అనుబంధ ఆలయా పునర్నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. దీనితో మిగతా నిర్మాణాలను వేగవంతం చేస్తున్నారు. ఆశించిన గడువులోగా ఆ పనులు పూర్తయ్యేందుకు యాడా ఆదేశాలతో ఆర్​అండ్​బీ శాఖ అధికారులు కృషి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details