Sarpanch rescued teacher: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు-కొలనుపాక మధ్యలో ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై నిర్మించిన కల్వర్టు పైనుంచి నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా రాకపోకలకు అంతరాయం కలిగి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి బచ్చన్నపేటకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయురాలు కల్వర్టుపై స్కూటీ అదుపు తప్పడంతో కింద పడిపోయింది. నీటి ప్రవాహానికి ద్విచక్రవాహనంతో పాటు వాగులోకి కొట్టుకుపోయింది. సహాయం కోసం ఆర్తనాదాలు చేసింది.
Sarpanch rescued teacher: వాగులో పడిపోయిన టీచర్.. కాపాడిన సర్పంచ్ - Sarpanch rescued teacher fell in vaagu
Sarpanch rescued teacher: ఓ సర్పంచ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. అదుపుతప్పి ద్విచక్రవాహనంతో సహా వాగులో పడిపోయిన ఉపాధ్యాయురాలిని ప్రాణాలకు తెగించి కాపాడారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
వాగులో పడిపోయిన టీచర్.. కాపాడిన సర్పంచ్
అదే సమయంలో అటుగా వెళ్తున్న బచ్చన్నపేట మండలం పరమడకేశాపూర్ గ్రామ సర్పంచ్ గిద్దెల రమేశ్ ఉపాధ్యాయురాలిని గమనించాడు. స్థానికుల సహాయంతో వాగులోకి దిగి టీచర్ను ఒడ్డుకు చేర్చాడు. సరైన సమయంలో స్పందించి.. ఉపాధ్యాయురాలి ప్రాణాలను కాపాడిన సర్పంచ్(sarpanch humanity)ను స్థానికులు అభినందించారు.