పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలిసి శనివారం ఆవిష్కరించారు.
బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి సర్దార్ పాపన్న గౌడ్ అని... ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని కోమటిరెడ్డి అన్నారు. పాపన్న గౌడ్ కీర్తి కేవలం విగ్రహా ఆవిష్కరణలకే పరిమితం కాకూడదని... ఆయన ఆశయ సాధనకోసం అందరం పనిచేయాలని కోమటిరెడ్డి సూచించారు.