సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహస్వామి గార్డెన్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేదర్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
యాదాద్రిలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు - yadhadri bhuvanagiri district latest news
సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజనులకు ఒక మంచి మార్గాన్ని చూపించారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ప్రతి ఏటా రూ.కోటి కేటాయించి సేవాలాల్ జయంతిని నిర్వహిస్తున్న కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
యాదాద్రిలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు
తెరాస ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతోందని గొంగిడి సునీత వెల్లడించారు. పవిత్ర క్షేత్రమైన యాదాద్రిలో బంజారా భవనం నిర్మించాలన్న విజ్ఞప్తిని తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా సురభి వాణీదేవి