యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలోని సిబ్బంది కరోనా బారిన పడుతూనే ఉన్నారు. యాదగిరిగుట్టలో ఐదురోజుల్లో 118 మందికి కరోనా సోకగా... అందులో ఆలయ సిబ్బంది 73 మంది ఉన్నారు. ఆలయంలో మూడు రోజులుగా ఆర్జిత సేవలు నిలిపివేసినా... కేసులు పెరుగుతూనే ఉన్నాయని... తెలిపారు. రేపటి నుంచి ఆర్జిత సేవలు యధావిధిగా కొనసాగనున్నందున కరోనా కట్టడికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
యాదాద్రి ఆలయంలో శానిటైజేషన్, పట్టణంలో బంద్ - కరోనా వార్తలు
యాదగిరిగుట్టలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. వైరస్ను కట్టడి చేసేందుకు అధికారులు ఆలయంలో అన్ని సేవలు నిలిపి వేసి... ఆలయ ప్రాంగణాలను శానిటైజ్ చేయిస్తున్నారు.
![యాదాద్రి ఆలయంలో శానిటైజేషన్, పట్టణంలో బంద్ sanitization at yadadri temple due to corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11209439-thumbnail-3x2-bundh.jpg)
కరోనాను కట్టడి చేసేందుకు... ఆలయంలో శానిటైజేషన్ ప్రక్రియ
కరోనా నియంత్రణ కోసం.. ఆలయాన్ని, ఆలయ పరిసర ప్రాంతాలను అధికారులు శానిటైజ్ చేయించారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు, దుకాణదారులు రెండురోజుల పాటు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.
ఇదీ చూడండి:'రాష్ట్రంలో కరోనా విజృంభణ.. బీ అలర్ట్'