రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సైదాబాద్ ఆత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే ట్రాక్ వద్ద బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే రాజు ఆత్మహత్యపై అతని కుటుంబ సభ్యులు స్పందించారు. రాజును పోలీసులే కాల్చిచంపేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహం అప్పగించాలని కోరుతున్నారు. రాజును పోలీసులే పొట్టనపెట్టుకున్నారని విలపిస్తున్నారు.
సైదాబాద్ పోలీస్స్టేషన్లో మమ్మల్ని ఉంచారు. నిన్ననే వదిలి వేశారు. పోలీస్స్టేషన్లోనే ఆరు రోజులు ఉన్నాం. రాజు దొరికితేనే వదిలేస్తామని చెప్పారు. నిన్నటికి నిన్న ఏమైందో తెలియదు మమ్మల్ని ఉప్పల్లో రాత్రి 9 గంటలకు వదిలేశారు. ఏమైంది అని అడిగితే ఎన్కౌంటర్ అర్డర్ వచ్చింది చేసేస్తాం అని చెప్పారు. అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాం. చనిపోయిన అతను మా ఆయనే.. ఇప్పటి వరకు ఎవరూ ఫోన్ చేయలేదు. నిన్న పదిసార్లు పచ్చబొట్టు గురించి అడిగారు. నాతో మా ఆయన తాగకపోతే మంచిగానే ఉండే వాడు. ఆయన అట్ల చేయడు అనుకున్నాం...
- నిందితుడు రాజు భార్య
అడ్డగూడురులోనే పోలీసులు రాజును పట్టుకెళ్లారు. ఇప్పుడేమో ఆత్మహత్య అంటున్నారు. మా కొడుకు శవం అప్పగించండి. మూడు రోజుల కిందటే దొరికిండు అన్నారు. చంపేశారు కదా.. ఇంకేముంది.