తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి రద్దీ పెరిగింది. ఒక వైపు ఆర్టీసీ సమ్మె, బంద్ ఉన్నప్పటికీ, బస్సు సౌకర్యం లేనప్పటికీ భక్తులు భారీగా తరలివచ్చారు. వారాంతపు సెలవు కావటం వల్ల భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. స్వామివారి ఆలయ పరిసరాలు, ప్రసాదాల కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. భీమన్నగుట్ట మఠాధిపతి రాఘవేంద్ర స్వామీజీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. వాహనాలకు పోలీసులు కొండపైకి అనుమతి నిరాకరించారు.
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం... కనిపించని బంద్ ప్రభావం - BANDH
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆర్టీసీ బంద్ ఉన్నప్పటికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం... కనిపించని బంద్ ప్రభావం