యాదాద్రీశుడి సన్నిధికి పోటెత్తిన భక్తులు - యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం, సెలవుదినం కావడం వల్ల కుటుంబ సమేతంగా భక్తులు తరలివచ్చారు.
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
యాదాద్రీశుడి సన్నిధికి భక్తులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. కార్తీకమాసం కావడం వల్ల భక్తులు దీపారాధన చేసి స్వామి వారిని వేడుకున్నారు. సాధారణ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా అధికారులు కొండపైకి వాహనాలు అనుమతించడం లేదు.
- ఇదీ చూడండి : పరుచుకున్న పచ్చదనం.. పల్లె అందాలు మధురం