తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రీశుడి సన్నిధికి పోటెత్తిన భక్తులు - rush at yadadri laxmi narasimha swamy

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం, సెలవుదినం కావడం వల్ల కుటుంబ సమేతంగా భక్తులు తరలివచ్చారు.

యాదాద్రీశుడి సన్నిధికి పోటెత్తిన భక్తులు

By

Published : Nov 10, 2019, 2:42 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. కార్తీకా మాసం అందులోనూ ఆదివారం సెలవు దినం కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీనితో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

కార్తీక మాసం కావడం వల్ల భక్తి శ్రద్ధలతో భక్తులు కార్తీక దీపారాధన చేస్తూ స్వామి వారిని వేడుకున్నారు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కల్యాణ కట్ట, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. దీనితో స్వామివారి ధర్మ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం, స్పెషల్ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. మరోవైపు పోలీసులు ఆలయ ఆభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

యాదాద్రీశుడి సన్నిధికి పోటెత్తిన భక్తులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details