ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంవల్ల భక్తులు కుటుంబ సమేతంగా భారీగా తరలివచ్చారు.
భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి క్షేత్రం - యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
భక్తులతో సందడిగా మారిన యాదాద్రి క్షేత్రం
స్వామివారి నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి దర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంటసమయం పడుతోంది. మరోవైపు ఆలయ ఆభివృద్ది పనుల దృష్ట్యా కొండపైకి వాహనాల అనుమతి నిరాకరించారు.
- ఇదీ చూడండి:కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా