యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నేడు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలాలయ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్షపుష్పార్చన నిర్వహించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చన.. పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు - yadadri temple rush
ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి క్షేత్రంలో ఉత్సవమూర్తులకు లక్ష పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు.
యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చన
ఆదివారం కావడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ధర్మ దర్శనానికి 2గంటల సమయం పండతుండగా.... స్పెషల్ దర్శనానికి దాదాపు గంటన్నర పడుతోందని భక్తులు తెలిపారు. మరోవైపు ఆలయ ఆభివృద్ది పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు.. నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం, అభిషేకం, సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు.
- ఇదీ చూడండి :పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!