యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో యాదాద్రి మోడల్ పల్లె ప్రకృతి వనం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ పడాల వనిత శ్రీనివాస్, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి హరిత వనానికి కేటాయించిన భూమిలో మొక్కలు నాటారు.
'పల్లె ప్రకృతి వనాలను కాపాడుకోవాలి' - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో సర్పంచ్ పడాల వనిత శ్రీనివాస్ ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి వనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు.
'పల్లె ప్రకృతి వనాలను కాపాడుకోవాలి'
ఇప్పటి వరకు మండలంలో 15 పల్లె ప్రకృతి వనాలు పూర్తయ్యాయని, ఈ పల్లె ప్రకృతి వనాలను కాపాడుకోవాలని కోరారు. పల్లె బాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ వనాల ద్వారా స్వచ్ఛమైన గాలి లభిస్తుందని, గ్రామాల్లో కోతుల బెడద తగ్గుతుందని తెలిపారు.
ఇదీచూడండి.. మా సర్కారు పథకాలు స్ఫూర్తిదాయకం: కేటీఆర్