తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఒక్కో బాధిత కుటుంబానికి 25 వేల రూపాయలు' - RACHAKONDA POLICE COMMISIONERATE

పైశాచిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను సీపీ మహేశ్ భగవత్ తన కార్యాలయంలో పరామర్శించారు. అనంతరం వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని ఆర్థికసాయం అందజేశారు.

ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే 100 నెంబర్​కు ఫోన్ చెయ్యండి : సీపీ

By

Published : May 4, 2019, 9:35 PM IST

హాజీపూర్ బాధిత కుటుంబాలకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆర్థిక సాయం అందించారు. మనీషా, కల్పన కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 వేల రూపాయల చెక్కును అందజేశారు. నేరేడ్ మెట్​లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు మహేశ్ భగవత్. కుటుంబంలో అర్హులైన వారికి పొరుగుసేవల ద్వారా ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
గత నెల 27న హాజీపూర్ గ్రామాన్ని సందర్శించి మరో బాధితురాలు శ్రావణి కుటుంబ సభ్యులకు 25 వేల రూపాయల ఆర్థికసాయం అందించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు... రహదారి సౌకర్యం కల్పిస్తామని మహేశ్ భగవత్ హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే 100 నెంబర్​కు ఫోన్ చేసి పోలీసుల దృష్టికి తీసుకురావాలని సీపీ గ్రామస్థులకు సూచించారు.

హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మహేశ్ భగవత్

ABOUT THE AUTHOR

...view details