తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులో భాగంగా.. ఆర్టీసీ బస్సులు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సులు నడిపించుకోవచ్చని కేంద్రం ఇచ్చిన సూచనలతో.. రాష్ట్ర ప్రభుత్వం బస్సులు నడిపేందుకు నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు.. రేపు యాభై శాతం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
రేపటి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు - లాక్డౌన్లో రోడ్డెక్కనున్న బస్సులు
లాక్డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సులు నడుపుకోవచ్చని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్సు సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఆధికారులు ఏర్పాట్లు చేశారు.
ముఖ్యమంత్రి ప్రకటన మేరకు.. అధికారులు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సుల్లో శానిటైజర్ సిద్ధం చేశారు. బస్సుల్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించి.. మాస్కు ధరిస్తేనే బస్సులోకి ఎక్కేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో అధికారులు బస్సుల ఫిట్నెస్ పరీక్షించారు. బస్సులతో పాటు.. బస్టాండ్ పరిసరాలను కూడా.. రసాయనాలతో శుభ్రం చేశారు. బస్సులో ఎక్కే ప్రయాణికుల కోసం.. బస్సులో శానిటైజర్లు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి:'మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం'