ఆర్టీసీ సమ్మెతో యాదగిరిగుట్టలో సెక్షన్ 144 - tsrtc strike today tsrtc latest news on strike
తమ డిమాండ్లను పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆర్టీసీ కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగాయి.
ఆర్టీసీ సమ్మెతో యాదగిరిగుట్టలో సెక్షన్ 144
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కార్మికులంతా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొనడంతో 93 బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. నిత్యం ప్రయాణికులు, భక్తులతో కిటకిటలాడే బస్టాండ్... సమ్మెతో నిర్మాణుష్యంగా మారింది. ముందస్తు జాగ్రత్తగా యాదగిరిగుట్టలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. పరిసర ప్రాంతాలన్నీ పోలీసుల మోహరింపుతో యాదగిరిగుట్ట మొత్తం ఖాకీమయం అయింది.