తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నపాపను తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన బస్సు.. 19 మందికి గాయాలు - వలిగొండలో బస్సు ప్రమాదం

RTC bus hit a tree in Yadadri Bhuvanagiri: రోడ్డుపై వెళ్తున్న వాహనాలు దారి మధ్యలో ఏదైనా అడ్డు వచ్చి దానిని తప్పించాలనుకొని వారి ప్రమాదంలో పడుతుంటారు. అదే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు రహదారి పక్కన ఉన్న చెట్టుని ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

Road accident in Yadadri Bhuvanagiri district
యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

By

Published : Mar 21, 2023, 7:53 PM IST

RTC bus hit a tree in Yadadri Bhuvanagiri: ప్రయాణం చేసినప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న చాలా దారుణాలు జరుగుతాయి. చేయని తప్పుకి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రమాదాలు జరుగుతునే ఉంటాయి. అలానే నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న చిన్నపిల్లని తప్పించబోయి రహదారి పక్కన ఉన్న చెట్టును బస్సు ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ నుంచి భువనగిరికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామం దగ్గరకి వచ్చినప్పుడు రహదారిపై ఓ చిన్నారి కనిపించింది. బస్సు డ్రైవర్​ ఆ చిన్నపిల్లను తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పింది. వెంటనే రహదారి పక్కన ఉన్న చింత చెట్టును ఢీ కొట్టాడు. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 19 మందికి గాయాలయ్యాయి. బస్సు వేగానికి డ్రైవర్​ స్టీరింగ్​కు సీట్​కి మధ్యలో ఇరుక్కుపోయాడు. స్థానికులు అతి కష్టం మీద అతనని బయటకి తీశారు. స్థానికులు 108కి ఫోన్​ చెయ్యడంతో ఆంబులెన్స్ వచ్చింది. అందులో వారిని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. 19 మందికి గాయాలు కాగా.. నలుగురిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్​కి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వేప చెట్టును ఢీ కొట్టిన బస్సు.. ఇద్దరు పిల్లలకు గాయాలు: శామీర్​పేట పోలీస్​ స్టేషన్​ పరిధిలో సోమవారం ఓ ప్రైవేట్​ పాఠశాల బస్సు శామీర్​పేట నుంచి తూంకుంటకు వెళుతుంది. మార్గం మధ్యలో డ్రైవర్​ అస్వస్థతకు గురికావటంతో బస్సు అదుపుతప్పి రోడ్డు కిందకు వెళ్లి.. అక్కడ ఉన్న వేప చెట్టును ఢీ కొట్టింది. దీంతో బస్సు అద్దాలు పగిలి ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పిల్లలను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారికి చికిత్స అందించారు. వేప చెట్టుకు ఢీ కొని ఆగినందున విద్యార్థులంతా క్షేమంగా బయటపడ్డారని.. లేదంటే తీవ్ర ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై ఎవరు ఫిర్యాదు చేయనందున కేసు పెట్టలేదని స్థానిక పోలీసులు చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details