యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రోటా వైరస్ వాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సంవత్సరం లోపు పిల్లలకు రోటా వైరస్ వాక్సిన్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్ని పథకాల్లో... ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైందని తెలియజేసారు. పిల్లలకు కలిగే విరోచనాల నుంచి ఈ వ్యాక్సిన్ రక్షణ ఇస్తుందని తెలియజేశారు. పిల్లలకు ఇచ్చినప్పటికీ ఇతర కారణాల వల్ల కూడా విరోచనలు కావొచ్చుని గుర్తుచేశారు. మన చుట్టుపక్కల రోటా వ్యాక్సిన్ ఇచ్చిన పిల్లలు సురక్షితంగా ఉన్నారా లేరా అని నిర్ధారించుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రారెడ్డి, ఎంపీపీ భూక్యా సుశీల, ఆలేరు మార్కెట్ ఛైర్మన్ పడాల శ్రీనివాస్,జడ్పీ వైస్ ఛైర్మన్ బీకు నాయక్, ఎపీటీసీ బొరెడ్డి వనజ పాల్గొన్నారు.
తుర్కపల్లిలో రోటా వైరస్ వ్యాక్సిన్ ప్రారంభం
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల పరిషత్ కార్యాలయంలో రోటా వైరస్ వ్యాక్సిన్ ప్రారంభించారు. సంవత్సరం లోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చారు.
తుర్కపల్లిలో రోటా వైరస్ వ్యాక్సిన్ ప్రారంభం