తెలంగాణ

telangana

ETV Bharat / state

కారును ముంచిన రోడ్డు రోలరు! - road rolar

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసను ట్రక్​ ఇబ్బంది పెడితే ఈసారి రోడ్డు రోలరు వంతైంది. ఏకంగా ఓ ఎంపీ విజయానికి గండికొట్టింది. భువనగిరి లోక్​సభ స్థానంలో రోడ్డు రోలరుకు ఏకంగా 27 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. చాలా మంది ఓటర్లు కారు గుర్తు అనుకుని రోడ్డు రోలర్​ ఓటు వేసినట్లు  తెలుస్తోంది.

బూర నర్సయ్యగౌడ్

By

Published : May 24, 2019, 7:55 AM IST

కారును ముంచిన రోడ్డు రోలరు!

భువనగిరి తెరాస అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్​ విజయాన్ని రోడ్డు రోలరు అడ్డుకుంది. ఇక్కడ కాంగ్రెస్​ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి 5,219 స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ స్థానంలో తెరాస, కాంగ్రెస్​, భాజపా, సీపీఐ అభ్యర్థులతో పాటు 9 మంది స్వతంత్రులు పోటీ చేశారు. ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 12 లక్షల 12వేల 631 ఓట్లు పోలయ్యాయి. విజేతకు 5 లక్షల 32వేల 795 ఓట్లు రాగా... బూర​కు 5 లక్షల 27వేల 576 ఓట్లు వచ్చాయి. భాజపాకు 65వేల 457, సీపీఐకి 28వేల 153 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థి సింగపాక లింగంకు 27వేల 973 ఓట్లు పోలయ్యాయి. అతనికి అధికారులు రోడ్డు రోలరు గుర్తు కేటాయించారు. బ్యాలెట్​ యూనిట్​పై కారు గుర్తు పైనుంచి మూడో సంఖ్యలో ఉండగా... రోడ్డు రోలరు గుర్తు కింద నుంచి మూడోదిగా ఉంది. రెండు గుర్తులు ఒకేలా కనిపించడం వల్ల కొందరు రోడ్డు రోలరుకు ఓటు వేసినట్లు తెరాస వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details