యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రం నుంచి వర్థమానుకోట గల మట్టి రోడ్డు పనులను ప్రారంభించారు. అడ్డగూడూరు సర్పంచ్ బాలెంల త్రివేణి దుర్గయ్య కొబ్బరికాయ కొట్టి రోడ్డుపనులకు శంకుస్థాపన చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సాయంతో చేపట్టిన మట్టిరోడ్డు మరమ్మతులను ప్రారంభించారు.
అడ్డగూడూరు రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం - అడ్డగూడూరు రోడ్డు పనులు
యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను అడ్డగూడూరు సర్పంచ్ ప్రారంభించారు. దీనికోసం ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ప్రత్యేకంగా నిధులు విడుదల చేశారు.

Road repair works started in addagoduru Yadadri bhuvanagiri district
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసి పెండల భారతమ్మ, మార్కెట్ డైరెక్టర్ పూలపెల్లి జనార్దన్ రెడ్డి ,తెరాస మండల ఉపాధ్యక్షులు బాలెంల విద్యాసాగర్, ఉప సర్పంచ్ వడకాల రణధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Bjp meet: పార్టీ బలోపేతంపై భాజపా చర్చ.. మధ్యాహ్నం ఈటల నివాసానికి తరుణ్‌చుగ్