యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాలపురం గ్రామస్తుల రహదారి అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చినా అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి, సిద్దిపేట జిల్లాల సరిహద్దుల్లోని కిలోమీటర్ రహదారి పనులను నిలిపివేశారు. నాలుగేళ్లుగా గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నా అధికారులు స్పందిచడం లేదు. యాదాద్రి జిల్లా గోపాలపురం నుంచి సిద్దిపేట జిల్లా దామరకుంట గ్రామానికి వెళ్లే లింక్ రోడ్డులో అటవీశాఖ హద్దురాళ్లు ఉండడంతో పనులు నిలిపేశారని గ్రామస్తులు వాపోతున్నారు.
అటవీశాఖ అభ్యంతరం...రోడ్డు కోసం నాలుగేళ్లుగా నిరీక్షణ
వారిది ఓ మారుమూల గ్రామం. ఉన్న రోడ్లు అంతంత మాత్రమే. గజ్వేల్ వెళ్లేందుకు రోడ్డు వేయడానికి ప్రభుత్వం అనుమతులిచ్చినా పనులు ముందుకు సాగలేదు. నాలుగేళ్లుగా గ్రామస్తులు మొరపెట్టుకుంటున్న అధికారులు స్పందించడం లేదు. రోడ్డు వేసేందుకు అటవీశాఖ అడ్డుతగలడంతో ఎక్కడికక్కడే పనులన్నీ ఆగిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
అటవీశాఖ అభ్యంతరం...రోడ్డు కోసం నాలుగేళ్లుగా నిరీక్షణ
గజ్వేల్‌కు వెళ్లేందుకే :గ్రామస్తులు
ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గజ్వేల్ వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గి ప్రయోజనకరంగా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. విద్యార్థులు చదువుకునేందుకు ఎక్కువగా గజ్వేల్ పట్టణానికే వెళ్తారు. అందువల్ల ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి, మా సమస్యకు పరిష్కారం చూపాలని గోపాలపురం గ్రామస్తులు వేడుకుంటున్నారు. అటవీశాఖ, జిల్లా అధికారులు స్పందించి రహదారి వెంటనే పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.