యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రింగ్ రోడ్డు పనులను అధికారులు వేగవంతం చేశారు. ఆర్అండ్బీ శాఖ.. పొలీస్ బలగాల మధ్య రహదారి విస్తరణ పనులు చేపట్టింది. దేవస్థానం పరిధిలోని పాత గోషాల వద్ద రోడ్డు నిర్మాణం చేపట్టే స్థలంలో చెట్లను తొలగించి ప్రహరీలను కూల్చి వేసి ఆ ప్రాంతాన్ని చదును చేశారు.
పోలీస్ భద్రత మధ్య యాదగిరిగుట్టలో రోడ్డు విస్తరణ పనులు - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు
యాదాద్రి అభివృద్ధి పనుల్లో భాగంగా రింగ్ రోడ్డు పనులను అధికారులు వేగవంతం చేశారు. యాదగిరిగుట్టలో పొలీస్ భద్రత మధ్య రహదారి విస్తరణ పనులు చేపట్టారు.
![పోలీస్ భద్రత మధ్య యాదగిరిగుట్టలో రోడ్డు విస్తరణ పనులు road extension work at yadagirigutta in yadadri bhuvanagiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10492634-thumbnail-3x2-yadadri.jpg)
పోలీస్ భద్రత మధ్య యాదగిరిగుట్టలో రోడ్డు విస్తరణ పనులు
కొన్నిరోజుల క్రితం అదే స్థలాన్ని చదును చేద్దామని అధికారులు ప్రయత్నించగా రోడ్డు బాధితులు అడ్డుకోవటంతో పనులను నిలిపివేశారు. మరోసారి అడ్డుకునే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి ఆందోళనలు జరగకుండా దాదాపు 150 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: 6న రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్బంధనం: తమ్మినేని