తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదాలకు ఆస్కారం.. వర్కింగ్​ బోర్డులు లేకుండా రోడ్ల నిర్మాణం - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు

అక్కడ రోడ్డు, వంతెన నిర్మాణం జరుగుతోంది. కానీ దానికి సంబంధించి ఎటువంటి సూచిక, రక్షణ(వర్కింగ్​) బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందో అని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి నుంచి మోత్కూరు రహదారి మధ్యలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరి దర్శనమిస్తోంది.

road construction without working board
రక్షణ బోర్డులు లేకుండా రోడ్డు నిర్మాణం

By

Published : May 17, 2021, 7:00 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నుంచి మోత్కూరు వరకు సూచిక, రక్షణ బోర్డులు ఏర్పాటు చేయకుండా కాంట్రాక్టర్​ రోడ్డు పనులు చేపట్టడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి వాహనదారులు బలవ్వాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

కొండాపురం, ముత్తి రెడ్డి గూడెం, కాటేపల్లి మధ్యలో జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనుల వద్ద ఎలాంటి రక్షణ బోర్డులు లేవు. ముత్తిరెడ్డి గూడెం, కాటపల్లిలో చేపడుతున్న వంతెనల నిర్మాణాల దగ్గర కూడా ఎలాంటి సూచికలు ఏర్పాటుచేయపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు, వాహనదారులు భయాందోళనలు వ్యక్తం చేశారు. అధికారులు రక్షణ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.

ఇదీ చదవండి:కొవిడ్​ బాధితుల్లో మనోధైర్యం నింపిన పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details