యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జాతీయ రహదారి-65పై ద్విచక్రవాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన ఐతగోని సత్తయ్య(65) అక్కడికక్కడే మృతి చెందగా... అతని భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ఓ వ్యక్తి మృతి, మరొకరికి తీవ్రగాయాలు - crime news
ద్విచక్రవాహనాన్ని ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపు చేపట్టారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఓ వ్యక్తి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
ఆమెను హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. వీరు లింగోజిగూడెంలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. లారీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై నవీన్‌బాబు తెలిపారు.
ఇవీ చూడండి: మలుపు వద్ద వేగం.. గుంతలో ఇరుక్కుపోయిన బొలెరో