తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో పట్టుబడిన నిషేధిత పొగాకు ఉత్పత్తులు

కారు టైరు పేలడం వల్ల మరో కారును ఢీకొట్టిన ఘటన హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా... ఓ కారులో నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టుబడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

road accident in yadadri bhuvanagiri district
రోడ్డు ప్రమాదంలో పట్టుబడిన నిషేధిత పొగాకు ఉత్పత్తులు

By

Published : May 29, 2020, 9:39 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కందిగడ్డ తండా శివారులో హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిషేధిత అoబర్ ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ఆలేరు ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ నుంచి జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ముందు టైరు పేలిపోయింది. టైరు పేలడం వల్ల కారు అదుపుతప్పి జనగామ నుంచి హైదరాబాద్​ వైపు వెళ్లే క్విడ్​ కారు వెనుక భాగాన్ని ఢీకొట్టింది.

ఈ ఘటనలో క్విడ్ కారు నడుపుతున్న సాగర్​కు స్వల్ప గాయాలయ్యాయి. బీదర్ నుంచి వస్తున్న కారులో నిషేధిత పొగాకు ఉత్పత్తులైన అంబర్ ప్యాకెట్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి, వాటిని స్వాధీనపర్చుకున్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి: ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు దోచిన సైబర్ నేరగాళ్లు

ABOUT THE AUTHOR

...view details