భువనగిరి పట్టణ శివారులోని సింగన్నగూడెం చౌరస్తా వద్ద రెండు కార్లు ఢీకొని అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ ఈసీఐఎల్‌కి చెందిన విక్రమ్, వినయ్‌లతో పాటు మరో ముగ్గురు కారులో వరంగల్ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో సింగన్నగూడెం క్రాస్ రోడ్డులో కారు మలుపు తిరుగుతున్నది.
రెండు కార్లు ఢీ.. పలువురికి గాయాలు - యాదాద్రి భువనగిరి వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని సింగన్నగూడెం చౌరస్తాలో ఎదురెదురుగా వస్తున్న కార్లు ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానికులు అంబులెన్సులో సమీప ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వేగంగా దూసుకొచ్చిన కారు మలుపు తిరుగుతున్న కారును ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న విక్రమ్, వినయ్, కవిత, భాస్కర్, రషీద్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగలేదు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతివేగమే ప్రమాదానికి కారణమని తేల్చారు. ప్రమాదం జరిగిన స్థలంలో మద్యం సీసా, సోడా, వాటర్ బాటిల్స్ దొరికాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా