యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా యాదాద్రి చుట్టూ రింగ్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు పనుల్లో భాగంగా పాత ఘాట్ రోడ్డు నుంచి పడమర వైపున, గండి చెరువు వైపుకు, రోడ్డు పక్కన డ్రైనేజి ఏర్పాటు చేసి, దానిపై సిమెంట్ పలకలను అమర్చుతున్నారు.
యాదాద్రి చుట్టూ వేగంగా జరుగుతున్న రింగ్‌రోడ్డు నిర్మాణం - ring road works fastened at yadadri district
యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా యాదాద్రి చుట్టూ రింగ్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయానికి ఉత్తరం వైపు నుంచి గండి చెరువు వరకు రోడ్డు పూర్తికాగా అక్కడ నుంచి పాత ఘాట్ రోడ్ నుంచి వైకుంఠద్వారం మార్గం వరకు పనులు వేగంగా సాగుతున్నాయి.
![యాదాద్రి చుట్టూ వేగంగా జరుగుతున్న రింగ్‌రోడ్డు నిర్మాణం yadadri bhuvangiri district ring road works](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8387989-958-8387989-1597214645470.jpg)
యాదాద్రి చుట్టూ వేగంగా జరుగుతున్న రింగ్‌రోడ్డు నిర్మాణం
రింగ్‌రోడ్డు నిర్వహిస్తున్న మార్గంలో వైకుంఠమార్గం పక్కనున్న పురాతన హనుమాన్ ఆలయం, పాత ఘాట్ రోడ్డు దగ్గరున్న మర్రిచెట్టు తొలగింపునకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది. ఆలయానికి ఉత్తరం వైపు నుంచి గండి చెరువు వరకు రోడ్డు పూర్తికాగా అక్కడ నుంచి పాత ఘాట్ రోడ్ నుంచి వైకుంఠద్వారం మార్గం వరకు పనులు సాగుతున్నాయి. అలాగే అక్కడున్న బండరాయి, మట్టి తొలగింపు పనులు, మెట్ల నిర్మాణం కోసం కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి:'కోజికోడ్ విమానాశ్రయ రన్‌వే సురక్షితమైనదే'