తెలంగాణ

telangana

ETV Bharat / state

బీబీనగర్ ఎయిమ్స్‌లో పునఃప్రారంభమైన ఓపీ సేవలు - Bbnagar aims latest updates

బీబీనగర్ ఎయిమ్స్‌లో ఓపీ సేవలు పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఎయిమ్స్‌లో ఓపీ సేవలు ప్రారంభం కాగా... కరోనా కారణంగా జులై 16న నిలిపివేశారు.

బీబీనగర్ ఎయిమ్స్‌లో పునఃప్రారంభమైన ఓపీ సేవలు
బీబీనగర్ ఎయిమ్స్‌లో పునఃప్రారంభమైన ఓపీ సేవలు

By

Published : Nov 6, 2020, 5:13 AM IST

బీబీనగర్ ఎయిమ్స్‌లో ఓపీ సేవలు పునఃప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఎయిమ్స్‌లో ఓపీ సేవలు ప్రారంభం కాగా... కరోనా కారణంగా జులై 16న నిలిపివేశారు.

ఇటీవల ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు సేవలను పునరుద్ధరించినట్లు వికాస్ భాటియా వెల్లడించారు. ప్రస్తుతం పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఫ్యామిలీ మెడిసిన్, గైనకాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. జనరిక్ మందుల దుకాణాల ద్వారా రోగులకు రాయితీపై మందులు అందిస్తున్నామని వెల్లడించారు. ఇన్‌పేషంట్ సేవలు మరో 2 నెలల్లో అందుబాటులోకి వస్తాయని వికాస్ భాటియా తెలిపారు.

ఇదీ చదవండి:'తెలంగాణ ఖ్యాతిని చాటేలా కొత్త సచివాలయ నిర్మాణం జరగాలి'

ABOUT THE AUTHOR

...view details