యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు గురువారం జిల్లా కేంద్ర ఆసుపత్రి సందర్శనకు వచ్చిన సీఎల్పీ నేత మలు భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. ఆసుపత్రిలో ఉండాల్సిన పోస్టులు, ఖాళీల వివరాలను ఆయనకు అందజేశారు.
సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని సీఎల్పీ నేతకు వినతి - assembly
పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. గురువారం భట్టి విక్రమార్క యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించారు.
సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని సీఎల్పీ నేతకు వినతి
అభివృద్ధి పేరిట ఎస్సీల భూములను లాక్కోవడం వంటి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని అయన్న కోరారు. ఈ కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యులు బర్రె జహంగీర్, పడిగెల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కొవిడ్ కోరల్నించి బయటపడినవారు లక్ష మందికి పైనే