మూడురోజుల అనంతరం ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ నియంత్రణలో భాగంగా.. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 9, 10, 11 తేదీల్లో స్వామి వారికి దర్శనానికి అనుమతించలేదు. కేవలం ఆలయంలో అర్చకులు నిత్యాకైంకర్యాలు మాత్రమే నిర్వహించారు. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ... భక్తులను ఆలయంలోకి అనుమతినిస్తున్నారు. ఆన్లైన్లో పూజలు బుక్ చేసుకున్న భక్తుల గోత్రనామాలతో పూజలు నిర్వహిస్తున్నారు.
మూడురోజుల అనంతరం యాదాద్రిలో దర్శనాలు పునఃప్రారంభం - సీఎం కేసీఆర్ పర్యటన
మూడు రోజుల పాటు దర్శనాలు నిలిపివేసిన అనంతరం... యాదాద్రిలో దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా ఆదివారం సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.
మూడురోజుల అనంతరం యాదాద్రిలో దర్శనాలు పునఃప్రారంభం
ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రిని సందర్శించనున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్ని ఆయన పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటిదాకా జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఒక నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో యాదాద్రి వచ్చిన కేసీఆర్ తరువాత మళ్లీ ఇక్కడ పర్యటించడం ఇదే ప్రథమం.