తెలంగాణ

telangana

ETV Bharat / state

చేనేత కార్మికులను ఆదుకోవాలని రిలే నిరాహార దీక్ష - చేనేత కార్మికుల ఆందోళన

కరోనా కారణంగా పలు వృత్తులు చేస్తున్న వారికి కష్టాలు తప్పడం లేదు. వైరస్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో తాము తయారు చేసిన ఉత్పత్తులు పేరుకుపోయాయని చేనేత కార్మికులు చెబుతున్నారు. సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమను ఆదుకోవాలని కోరుతూ భూదాన్ పోచంపల్లిలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.

Relay initiation of handloom workers to support at bhoodan pochampally
చేనేత కార్మికులను ఆదుకోవాలని రిలే నిరాహార దీక్ష

By

Published : Jul 22, 2020, 4:16 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరాయి. స్థానిక విపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళనకు సంపూర్ణ మద్దతు, సంఘీభావం ప్రకటించాయి.

కరోనా నేపథ్యంలో నాలుగు మాసాలుగా చేనేత కుటుంబాలకు ఉపాధి కొరవడిందన్నారు. పెద్ద ఎత్తున పేరుకుపోయిన వస్త్రాలు ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని చేనేత ఐక్య కార్యాచరణ సమితి విజ్ఞప్తి చేసింది. 40 శాతం నూలు రాయితీని ప్రతి చేనేత కుటుంబానికి నెలకోసారి నేరుగా అందించాలని కోరారు. ప్రతి కార్మిక కుంటుంబానికి రూ.8 వేల రూపాయల చొప్పున ఆరు మాసాలపాటు భృతి ఇవ్వాలని అభ్యర్థించారు. చేనేత వృత్తికి భద్రత, భరోసా కల్పించాలని ఐకాస ప్రతినిధులు కోరారు.

చేనేత కార్మికులను ఆదుకోవాలని రిలే నిరాహార దీక్ష

ఇదీ చూడండి :ఆరేళ్ల బాలుడు ఆస్పత్రిలో స్ట్రెచర్​ తోస్తూ...

ABOUT THE AUTHOR

...view details