ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదాద్రి సకల సదుపాయాలతో అద్భుత పర్యాటక క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. పునర్ నిర్మాణంలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం.. శిల్పకళా రూపాలతో నిర్మితమవుతోంది. యాత్రికులు మళ్లీ మళ్లీ రావాలనిపించేలా.. నల్లరాతిపై చెక్కిన రూపాలకు తుదిమెరుగులు అద్దుతున్నారు. భక్తజనం భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని పూజలు చేసుకునేలా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
యాదాద్రి ఆలయంలో నల్లరాతిపై చెక్కిన శిల్పాలకు తుది మెరుగులు - యాదాద్రి ఆలయం తాజా వార్తలు
యాదాద్రి పుణ్య క్షేత్రానికి వచ్చే యాత్రికులకు మళ్లీ మళ్లీ రావాలనిపించేలా శిల్పకళా రూపాలతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దివ్యంగా రూపొందుతోంది. రెండున్నర ఎకరాల్లో పునర్నిర్మితమైన స్వామి సన్నిధిలో భక్తి, ప్రకృతిని ప్రస్పుటించే శిల్ప రూపాలు కనులవిందు గొలుపుతున్నాయి. నల్ల రాతిపై చెక్కిన రూపాలకు శిల్పులు తుది మెరుగులు దిద్దుతున్నారు.
యాదాద్రి ఆలయంలో నల్లరాతిపై చెక్కిన శిల్పాలకు తుది మెరుగులు