రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. అనుబంధ ఆలయమైన శివాలయం ముఖమండపం ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలపై నంది విగ్రహం ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఆకర్షణీయంగా ఉండేలా నంది విగ్రహాన్ని తీర్చిదిద్దారు. శివాలయం చుట్టూ ప్రహరీపై నంది విగ్రహాలను అమర్చే పనులు వేగంగా జరుగుతున్నాయి.
తుదిదశకు చేరుకుంటున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు - యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పనులు
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. అనుబంధ ఆలయమైన శివాలయం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు శివాలయం ముఖమండపం ఎదుట ధ్వజ స్తంభానికి వెనుకనున్న ఆవరణలో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
తుదిదశకు చేరుకుంటున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు
యాదాద్రిలో కొండపైన గల శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా విగ్రహాల రూపకల్పన జరుగుతోంది. ఆలయ ఉత్తర దక్షిణ దిశలోని ప్రహరీపై 32 నంది విగ్రహాలు ఏర్పాటు చేస్తామని, ప్రధాన స్థపతి వేలు తెలిపారు.
ఇదీ చూడండి:గంఢభేరుండ నారసింహుడికి మకర తోరణం