యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు మండలం లక్ష్మీదేవికాల్వ గ్రామానికి చెందిన కొలుగూరి లక్ష్మీ.. భర్తను కోల్పోయి చాలా ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తోంది. ఎవరిపై ఆధారపడకుండా కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అలా కూలీకి వెళ్తూ రూ.5వేలు కూడబెట్టింది. ఆ డబ్బును బీరువాలో దాచుకుంది.
మూణ్నెళ్ల తర్వాత అవసరం పడి.. డబ్బు తీసుకుందామని ఆ వృద్ధురాలు బీరువా తెరిచింది. తాను దాచుకున్న ఐదు వేల రూపాయల విలువ గల నోట్లను ఎలుకలు కొరికేశాయి. బీరువాలోని దుస్తులను కూడా చించేశాయి. ఆ నోట్లను ఇరుగుపొరుగుకు చూపించగా.. అవి చెల్లవని వారు చెప్పారు. తాను ఎంతో కష్టపడి.. ఎండనకా.. వాననకా.. కూలీ చేసి ఆ డబ్బు కూడబెట్టానని.. ఇప్పుడు తన కష్టమంతా ఎలుకలు మట్టిపాలు చేశాయని వాపోయారు. అధికారులు స్పందించి.. ఆ నోట్లను బ్యాంకులో మార్పిడి చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతోంది.