యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల పరిధిలోని పలు గ్రామాల్లోని ముస్లింలకు హీల్ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత రంజాన్ కానుకగా పలు వస్తువులను అందించారు. లాక్డౌన్ నేపథ్యంలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి.. వారికి నిత్యావసరాలు అందించారు.
ముస్లింలకు రంజాన్ కానుక పంపిణీ - నిత్యావసర సరుకుల పంపిణీ
రంజాన్ మాసం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. ముస్లింలతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు కూడా నిత్యావసరాలు అందించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికును శాలువాలు కప్పి సత్కరించారు.

లాక్డౌన్ సమయంలో రంజాన్ రావడం వల్ల ముస్లింలకు సాయం చేస్తున్నారు. పండుగ నిర్వహించుకోవడానికి, ఉపవాసాలు ఉండడానికి ఇబ్బంది పడకుండా తమ వంతు సహకారంగా నిత్యావసరాలు, రంజన్ కానుకగా పలు వస్తువులు అందిస్తున్నట్టు హీల్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు. మండల కో ఆప్షన్ సభ్యులు ఆదిల్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే గొంగిడి సునీత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాలని, లేకపోతే జరిమానా విధించాల్సి వస్తుందని, పోలీసులు, అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే గొంగిడి సునీత తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లోకి ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే.. పోలీసులకు సమాచారం అందిచాలని ప్రజలకు సూచించారు.
ఇవీ చూడండి: కన్నీటి గాథపై స్పందించిన మానవత్వం