తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - తెలంగాణ వార్తలు

మోత్కూరులో శ్రీరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి వారిని శేష వాహనంపై ఊరేగించారు. శనివారం అగ్నిగుండాల కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ramalingeswara swamy brahmotsavalu, yadadri bhuvanagiri district news
మోత్కూరులో రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, రామలింగేశ్వర స్వామి ఆలయంలో అగ్నిగుండాలు

By

Published : Apr 3, 2021, 12:58 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోని శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి వారిని శేష వాహనంపై ఊరేగించారు. మహిళల కోలాటాలు, భక్తుల భజన కీర్తనల మధ్య శివనామ స్మరణ చేస్తూ శోభయాత్ర నిర్వహించారు.

శనివారం ఉదయం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండాల కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉత్సవాల్లో మున్సిపాలిటీ ఛైర్ పర్సన్, దేవాలయ గౌరవ అధ్యక్షులు శ్రీమతి తీపిరెడ్డి సావిత్రి, ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ గుండగోని రామచంద్రు, బుర్ర యాదయ్య, సూదగాని కృష్ణయ్య, గుండు శ్రీను, శేఖర్, మత్యగిరి, కారిపోతుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మోత్కూరులో రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, రామలింగేశ్వర స్వామి ఆలయంలో అగ్నిగుండాలు

ఇదీ చదవండి:ముళ్ల పొదల్లో పసికందు.. ఆడ శిశువు అని వదిలేశారా?

ABOUT THE AUTHOR

...view details