తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో వైభవంగా రామలింగేశ్వరస్వామి కల్యాణం - yadadri temple

యాదాద్రి క్షేత్రంలో.. పర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం కన్నులపండువగా జరిగింది. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

Ramalingeswara Swamy and Parvathavarthini marriage celebrations in yadadri
కన్నులపండువగా పర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం

By

Published : Mar 11, 2021, 7:25 AM IST

యాదాద్రి కొండపై కొలువైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం రాత్రి కన్నులపండువగా జరిగింది. స్వామివారికి ఆలయ అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు.

అనంతరం కల్యాణ మండపంలో ఆది దంపతులను అధిష్టింపజేసి కల్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు. వేదమంత్రోచ్ఛారణలు, వేదపారాయణాలు, మంగళవాద్యాల మధ్య కల్యాణోత్సవం అట్టహాసంగా జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

ABOUT THE AUTHOR

...view details