తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్వాంగ సుందరంగా పర్వత వర్ధిని రామలింగేశ్వరాలయం - యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం పనులు వేగవంతమయ్యాయి. ఆలయ ప్రధాన మండపంపై శిల్పులు నంది విగ్రహాలు ఏర్పాటు చేశారు.

ramalingeshwara temple work is in progress at yadadri
సర్వాంగ సుందరంగా పర్వత వర్ధిని రామలింగేశ్వరాలయం

By

Published : Jan 12, 2020, 5:00 PM IST

సర్వాంగ సుందరంగా పర్వత వర్ధిని రామలింగేశ్వరాలయం

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులను యాడా అధికారులు వేగవంతం చేశారు.

ప్రధాన మండపంపై ఏర్పాటు చేసిన నంది విగ్రహాల వల్ల ఆలయం మరింత సుందరంగా కనిపిస్తోంది. శివాలయం ముందు భాగంలో ధ్వజస్తంభం, బలిపీఠం, పద్మాన్ని శిల్పులు ఏర్పాటు చేస్తున్నారు.

మరొకవైపు... విష్ణు పుష్కరిణి పనులను కూడా అధికారులు వేగవంతం చేశారు. పుష్కరిణిలోని మండపంపై పిల్లర్లు ఏర్పాటు చేశారు. కృష్ణ శిలతో చేస్తున్న ఈ మండపం పనులు త్వరలోనే పూర్తి కానున్నట్లు యాడా అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details