అయోధ్య రామమందిర నిర్మాణం భూమిపూజ నేపథ్యంలో స్థానికంగా ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవాలకు అనుమతి లేదని డీసీపీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. హద్దుమీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భువనగిరి పట్టణంలోని వివిధ సంఘాల నాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
ర్యాలీలు, విజయోత్సవాలకు అనుమతి లేదు: డీసీపీ - telangana l;atest news
అయోధ్యలో రామమందిర నిర్మాణం భూమి పూజ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. డీసీపీ నారాయణరెడ్డి భువనగిరి పట్టణంలో వివిధ సంఘాల నాయకులతో వేర్వేరుగా మంగళవారం సమావేశమయ్యారు. .
![ర్యాలీలు, విజయోత్సవాలకు అనుమతి లేదు: డీసీపీ yadadribhuvanagiri dcp pressmeet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8299018-269-8299018-1596601747440.jpg)
ర్యాలీలకు, విజయోత్సవాలకు అనుమతి లేదు: డీసీపీ
నిరంతరం నిఘా కొనసాగిస్తామని నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఏసీపీ భుజంగరావు, ఇన్‌స్పెక్టర్ సుధాకర్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.