హైదరాబాద్ నారాయణగూడలోని రాజాబహదూర్ వెంకట రామిరెడ్డి మహిళా కాలేజీ నుంచి 45 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు యాదాద్రి భువనగరి జిల్లా తుర్కపల్లిలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఇబ్రహీంపురం, కొనాపూర్ గ్రామాల్లో మూడు రోజుల పాటు క్యాంపును నిర్వహించారు.
ఎన్ఎస్ఎస్ విద్యార్థుల స్వచ్ఛ భారత్ కార్యక్రమం - ఎన్ఎస్ఎస్ విద్యార్థులు
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్ఎస్ఎస్ విద్యార్థుల స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో హరితహారం, పోషకాహార విలువలు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పి. ఝాన్సీలక్ష్మి, రుమిలా సీతారాం, గ్రామ సర్పంచ్, పలువురు అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మూడు రోజులు చేపట్టిన ఈ క్యాంపులో భాగంగా గ్రామాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు.
హరితహారం, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, మద్యపాన నిషేధం వంటి అంశాలన్నింటినీ ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేపట్టామని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలకు పోషకాహార ప్రాముఖ్యత, దేహ పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారం మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని విద్యార్థులు అన్నారు.