తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో తెల్లవారుజామున ఒక్కసారిగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి బాలాలయంలోకి వర్షపు నీరు(rain Water) వచ్చి చేరింది.
Rain Water : యాదాద్రి బాలాలయంలోనికి వర్షపు నీరు - yadadri temple
భానుడి తాకిడికి అల్లాడిపోతున్న జనం ఒక్కసారిగా చల్లబడ్డారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. ఉదయం ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలోనికి నీరు(rain Water) చేరింది.
వర్షపు నీరు, యాదాద్రి ఆలయంలోనికి వర్షపు నీరు, యాదాద్రి టెంపుల్లోకి వరద
ప్రధానాలయం వైపు గల తలుపు నుంచి బాలాలయంలోకి వర్షం నీరు(rain Water) చేరినట్లు సిబ్బంది తెలిపారు. ఈ నీరు..మెట్ల దారి గుండా, క్యూ లైన్లలోకి ప్రవహించింది. బాలాలయంలోకి వాననీరు చేరడం వల్ల ఉదయం స్వామివారి సుప్రభాత సేవ చేయడంలో అర్చకులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం సిబ్బంది వర్షపు నీటికి బయటకు పంపించారు.