యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలకు గాను 15 మండలాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురిసింది. అత్యధికంగా రామన్నపేటలో 86.8 మిల్లిమీటర్లు... అత్యల్పంగా ఆలేరులో 50.8 మిల్లిమీటర్లు కురిసింది. గుండాల, మోత్కూర్, రాజపేట, చౌటుప్పల్ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. భువనగిరి నియోజకవర్గ పరిధిలోని భువనగిరి, వలిగొండ, పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.
జోరుగా కురుస్తున్న వర్షం.. వాహనదారుల ఇక్కట్లు
యాదాద్రి భువనగిరి జిల్లాలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండగా.. అత్యధికంగా రామన్నపేటలో 86.8 మిల్లిమీటర్లు, అత్యల్పంగా ఆలేరులో 50.8 మిల్లిమీటర్లు కురిసింది. పలు చోట్ల కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమై వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
జోరుగా కురుస్తున్న వర్షం.. సేదతీరుతున్న ప్రజలు
వలిగొండ మండలం వలిగొండ నుంచి దాసిరెడ్డిగూడెం, మల్లేపల్లి, లోతుకుంట, సుంకిశాలకు వెళ్లే రహదారులపై ఉన్న కాలువలు పొంగి కల్వర్టుల మీదుగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇందువల్ల వాటి పరిసర గ్రామాలకు వెళ్లేవారికి రాకపోకలకు అంతరాయం ఏర్పడి ఇబ్బందిపడ్డారు. మరోవైపు శ్రావణమాసం వల్ల ఇళ్లలో శుభకార్యాలు నిర్వహించుకునే వారు వర్షం వల్ల ఇబ్బందిపడ్డారు. జిల్లావ్యాప్తంగా వాతావరణం చల్లబడగా ప్రజలు సేదతీరారు.